Megastar chiranjeevi sensational comments on Janasenani Pawan Kalyan

Published 2022-01-03
జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడే విధానం,ప్రజలకు న్యాయం కోసం ప్రశ్నించే విధానం ఖచ్చితంగా సబబే అంటూ మద్దతు ప్రకటించిన చిరంజీవి.

Chiranjeevi sensational comments on Pawan Kalyan's Fight for people.
------------------------------------
ఇతర పోస్టులు (Other Posts):

"వైఎస్సార్ బాదుడే బాదుడు" పధకంలో బాగంగా ఇప్పుడు కూరగాయల ధరలపై బాదుడే బాదుడు.... దుర్యోధన రెడ్డి రాజ్యంలో దానం చేయాల్సిన తోటకూర కట్ట కూడా 40 రూపాయలకు అమ్ముతున్నారు.

నాడు రాజన్న రాజ్యంలో 250కే గ్యాస్ అన్నాడు. నేడు నకిలీ కాంగ్రెస్ రెడ్డి తన రాజ్యంలో ఆ ధర 1000 దాటినా నోరు మెదపకుండా తండ్రి పోరాడిన కంపెనీ వ్వక్తితోనే చేతులు కలిపాడు.

పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు దిక్కేది?

నకిలీ కాంగ్రెస్ రాజ్యంలో కరోనా బాధిత కుటుంబాలకు ఓదార్పు యాత్రలు కూడా లేవు?
-----------------------------------------------

ఏడాదికి రెండు-మూడు సినిమాలు చూసే వారి గురించి అమితమైన ప్రేమతో అలోచించేస్తున్న దయా హృదయ ప్రభుత్వం, జీవిత కాలంలో ఒక్క సొంత ఇల్లైనా కట్టుకోవాలనుకునే వారి కోసం ఆలోచించకపోవడం బాధాకరం. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలైతే రెంటికీ చెడ్డ రేవడిలా అటు పధకాలు అందవు, ఇటు జీతాలు పెరగవు. అటు పెరిగిన సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుకల ధరలతో ఇళ్లు కట్టలేరు, ఇటు పెరిగిన అద్దెలు కట్టలేరు.

సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుకలు అన్నీ సినిమా టిక్కెట్లకు ధర నిర్ణయించినట్టే ఓ 100 కో 200 కో అమ్మితే కోటి మందికి పైగా పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది.

అలాగే పెన్షన్లు కూడా బ్యాంక్ ఖాతాల్లో వేస్తే చాలా చోట్ల చేతివాటం చూపుతున్న వాలంటీర్లను అదుపుచేసి, ప్రజాధనం పొదుపు చెయ్యొచ్చు. అలానే స్కూల్, కాలేజీ ఫీజులు ఒక్కో విద్యార్థికి ఏడాదికి 1000 రూపాయలే గరిష్ట ఫీజుగా నిర్ణయించి, ఆసుపత్రిలో బిల్లులకు కూడా ఒక్కో పేషెంట్ కు 1000 రూపాయలే లిమిట్ పెట్టి ప్రభుత్వమే ఆన్లైన్లోనే ద్వారా ప్రజలకు సేవ చేసినట్టు అవుతుంది. మీరు ఏమంటారు ఫ్రెండ్స్?
________________________

అయ్యా పేద, మధ్యతరగతి సార్లు!

పన్ను కట్టేది ఆదాయం లక్షల్లో ఉన్న వాళ్ళేనని భ్రమపడుతున్న పేద, మధ్యతరగతి వారంతా, మనం రోజు వాడే పేస్టు నుండి పామాయిల్ వరకు, కవర్లలో కొన్న పంచదార నుండి ప్యాక్ చేసిన పచ్చళ్ళ వరకు , మాస్కుల నుండి సానిటైజర్ వరకు‌, పెట్రోల్ నుండి ఫేనైల్ వరకు ఎంత పన్ను కడితే మహా దొంగ మేతలు ఎంత మింగేస్తున్నారో తెలుసా? పన్నుపోటు మనకు - పదకాల పేర్లు వాళ్ళకా?

ఇన్ని జరిగినా ఇంకా బామ్మ ఒడి, ఇంద్రన్న పాలపొడి, వెఎస్సు రీయింబర్స్మెంట్, ఎన్టీఓడి విదేశి విద్యాదానం అంటూ వీరు పెట్టే తాత్కాలిక తాయిలాలతో మన పిల్లలు పనికిరాని చదువులు చదివాక, వీరికి బానిసలా మారిపోయాక, పాలేర్లుగా జన్మభూమి కమిటీలోనో లేదా వాలంటీర్ గానో ఉద్యోగమిచ్చి ఆదుకుంటారు. వారి పార్టీలను, కుటుంబ వ్యాపారాలను పెంచిపోషించుకుంటారు. మరి పేదవారికి పై పధకాలు ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా ఇవ్వొచ్చు. కానీ ముందుగా అసలు ఒక బిసి లేదా ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఓసి లో పేదవారు ఒక వినూత్న ఆలోచనతో పరిశ్రమ పెట్టాలంటే ఇవ్వని భూమిని, ఈ నాయకుల బినామీ కంపెనీలకు మాత్రం సెజ్ ల పేరుతో రైతుల నుండి దోచుకుని మరీ కేటాయిస్తున్నారు. మరి 70 ఏళ్ళ మన స్వతంత్ర భారతంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది వెనుకబడిన వర్గాలు వారు పరిశ్రమలు స్ధాపించి నిలదొక్కుకున్నారో వేళ్ళపై లెక్క పెట్టడానికి కూడా లేరు. మన పిల్లలు ఏ వ్యాపారం గానీ, సొంత రాష్ట్రంలో ఉండి ఒక ఉన్నత ఉద్యోగం గానీ చెయ్యకుండా చేసే దొరల పదకాలే ఇవి. సొంతంగా కష్టపడి చదివి ఈ పధకాల సాయంతో కలెక్టరయినా, వైద్యులయినా కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి బానిసగా బ్రతకకపోతే పిచ్చివాళ్ళుగా ముద్ర వేసేస్తున్నారు. సమూలమైన మార్పు గట్టిగా కోరుకోకపోతే మన పిల్లలకు బానిసత్వమే మిగులుతుంది. వారి పిల్లలకు వ్యాపారాలు, రాజకీయాల్లో వారసత్వం కలుగుతుంది.
ఇది నిజం కాకుంటే ఇప్పటికే అనేక మంది పరిశ్రమలు పెట్టే స్ధాయిలో ఉండి కొత్తగా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్ధాయిలో జీవించేవారు. అంతేగాని అమెరికా వాడు తుమ్మితే ఇక్కడ ఊడిపోయే చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం తలిదండ్రులను వదిలేసి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, అమెరికా అంటూ రాష్ట్రాలు, దేశాలు పట్టుకుని తిరిగేవారు కాదు. ఇది నిజం కాకుంటే చిన్న చిన్న స్కూళ్ళలో అరకొర జీతాలకు జీవితాలు దారబోసే వారు కాదు. ఆలోచించండి. మన భవిష్యత్తును మన తల్లిదండ్రులు తెలిసో తెలీకో ఈ నాయకుల చేతిలో పెట్టి నాశనం చేశారు. మన పిల్లల భవిష్యత్తు మాత్రం అలా కానివ్వకుండా ఉండాలంటే బానిస పధకాలు కాదు భవిష్యత్తు మార్చే విద్యా విధానం, పరిశ్రమలు, వ్యవసాయం,అభివృద్ధి కావాలని ప్రశ్నించండి.

పోరాడితే పోయేదేం లేదు ఎదవ బానిస సంకెళ్లు తప్ప. మరి మీది పోరటమా లేక వారు దోచుకోవడానికి సహకారమా అన్నది ఆలోచించండి. మన పిల్లలకు దోపిడీ చేసి సంపాదించమని నేర్పిస్తామా లేక ధానంతో కూడిన ధనార్జన నేర్పిస్తామా అన్నది మనసుతో ఆలోచించండి.

సంక్షేమ పథకాలు అనేవి మనకోసం.
అభివృద్ధి అనేది మన బిడ్డల కోసం.
సంక్షేమాన్ని చంపి అభివృద్ధి మాత్రమే అంటే మనల్ని చంపి ఆ రక్తంతో మన బిడ్డలకు అన్నం పెట్టడమే.
మరి అభివృద్ధిని చంపి సంక్షేమ పథకాలు మాత్రమే అంటే మన బిడ్డల బ్రతుకు తెరువు అనే గొంతు కోసి ఆ రక్తంతో మనకు అన్నం పెట్టడమే.
ఇంకెన్నాళ్ళు తింటారు ఇలాంటి రక్తపు కూడు? రెండు ఒకేసారి నడిస్తేనే మనం, మన బిడ్డలు బ్రతికినట్టు. మరి అలా నిజాయితీగా నడిపగలిగే ధర్మరాజు లాంటి నాయకుల్నే ఎన్నుకుందాం.

ప్రజాపాలనతో మార్పు కోసం మన "Pakka Logic" ఫేస్బుక్ పేజిని ఫాలో అవుతు, "Pakka Logic" యూట్యూబ్ చానల్ని సబ్స్క్రయిబ్ చేయండి.

#APNeedsPK
#Janasena
JSPforAP_Roads
#telugu #latestupdates #tv #channel #news #new #update #today #breaking #Tdp #ycp #ysrcp #pawankalyan #ysjagan #radheshyam #cbn #KTR #CMKCR #bjp #siddarth #HeroNani #Nani #Prabhas
#ViralVideoViral
Viral Video Viral

All Comments (1)